అన్నలారా,తమ్ములార ఆత్మహత్యలు మానండి
మన తెలంగాణా తల్లికి కడుపు కొత్త మిగిల్చకండి
ముందున్న మంచి రోజులు మనము అందరం
కలిసి ఆనందించాలి కాదంటారా ?
అందుకే ఆత్మహత్యలు మానండి.
Monday, May 17, 2010
Saturday, May 15, 2010
నల్లగొండ గోడు .......

నల్లగొండ ఫ్లోరైడ్ భాదితులను పట్టించుకునే నాయకుడే లేడా?
ఎన్నికలపుడు కనిపించిన నల్లగొండ ప్రజల బాధలు ఇప్పుడు ఎందుకు
కనబడడం లేదు?
ప్రక్కనే 13 కిలోమిటర్ దూరంలో కృష్ణమ్మా ఉన్న బుక్కెడు నీళ్ళు తాగడానికి లేవు ,కాని 413 కిలోమిటర్లు దూరంలో ఉన్న ఆంధ్ర లేదా రాయలసీమ ప్రాంతాలకు ఎలా వేల్తునై ?
నల్లగొండ ప్రాంత ప్రజలకు మంచి నీళ్ళు అందించడానికి చేప్పట్టిన ఎస్ .ఎల్ .బి సి సొరంగం మొదలుపెట్టి నాలుగు దశాబ్దాలు గడిచిన ఇంక ఎందుకు పూర్తి అవ్వలేదు ?
తెలంగాణా ప్రాంతమన ?
మరి ఎందుకు పూర్తి కాలేదు ?
Thursday, May 13, 2010
నా ప్రాణం

పోరాటం">పోరాటం
అధికారం కోసం ఆరాటం కాదు మాది
ఆకలి మంటల పోరాటం
ఆస్తుల కోసం ఆరాటం కాదు మాది
అస్తిత్వం నిలుపుకునేదుకు పోరాటం
అనగదోక్కాలి అనే అహంభావం కాదు మాది
ఆత్మ గౌరవం కోసం అంకితభావం
స్వార్ధపూరితపు రాజకీయాలు కావు మావి
స్వపరిపాలన కోసం సాగించే సమరాలు
బలిసిన మాటలు కావు మావి
బలిదానపు బాటలు
కదలలేని కడలి కాదు నా తెలంగాణ
ఉరకలేసే ప్రవహోధ్యమ పరిమళం
అమర వీరుల త్యాగాల స్ముతులే
మా జీవిత గతులు
ఆత్మార్పణ చేసుకునే వీరుల ఆశయమే
మా అన్వేషణ మార్గం
చరిత్ర గతిని మార్చటమే మా ధ్యేయం
తెలంగాణ సాధించటం ఖాయం
అప్పటి వరకు
తెలంగాణ పోరులో ప్రాణాలు అర్పించే
ప్రతి వీరుడు
మళ్లీ రేపు ఉదయించే సూర్యుడు
మాలో ఉద్యమ స్పూర్తి నింపే ధీరుడు
మా మనస్సులో కలకాలం నిలిచే అమరుడు
రచన
బోట్ల సతీష్ కుమార్
బోట్ల వనపర్తి
కరీంనగర్
9985960614
Wednesday, May 12, 2010
Subscribe to:
Comments (Atom)