
పోరాటం">పోరాటం
అధికారం కోసం ఆరాటం కాదు మాది
ఆకలి మంటల పోరాటం
ఆస్తుల కోసం ఆరాటం కాదు మాది
అస్తిత్వం నిలుపుకునేదుకు పోరాటం
అనగదోక్కాలి అనే అహంభావం కాదు మాది
ఆత్మ గౌరవం కోసం అంకితభావం
స్వార్ధపూరితపు రాజకీయాలు కావు మావి
స్వపరిపాలన కోసం సాగించే సమరాలు
బలిసిన మాటలు కావు మావి
బలిదానపు బాటలు
కదలలేని కడలి కాదు నా తెలంగాణ
ఉరకలేసే ప్రవహోధ్యమ పరిమళం
అమర వీరుల త్యాగాల స్ముతులే
మా జీవిత గతులు
ఆత్మార్పణ చేసుకునే వీరుల ఆశయమే
మా అన్వేషణ మార్గం
చరిత్ర గతిని మార్చటమే మా ధ్యేయం
తెలంగాణ సాధించటం ఖాయం
అప్పటి వరకు
తెలంగాణ పోరులో ప్రాణాలు అర్పించే
ప్రతి వీరుడు
మళ్లీ రేపు ఉదయించే సూర్యుడు
మాలో ఉద్యమ స్పూర్తి నింపే ధీరుడు
మా మనస్సులో కలకాలం నిలిచే అమరుడు
రచన
బోట్ల సతీష్ కుమార్
బోట్ల వనపర్తి
కరీంనగర్
9985960614
No comments:
Post a Comment